NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
    ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు

    Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 17, 2024
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల కోసం రెండు రోజుల క్రితం రూ.400 కోట్లకుపైగా విడుదల చేయగా.. తాజాగా,భారతమాల పరియోజన మొదటి దశ కింద రాష్ట్రానికి మంజూరైన 7 నేషనల్ హైవేల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

    గతేడాది ఈ ప్రాజెక్టులు మంజూరు చేసినా, వాటి టెండరింగ్ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు కేంద్రం అన్నింటినీ ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్ రహదారులు,భవనాల శాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.

    రాష్ట్రంలో మొత్తం 384 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి ముందుగా అంచనా ప్రకారం రూ. 6,646 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు.

    అయితే, ప్రస్తుతం ఆ వ్యయాన్ని రూ. 6,280 కోట్లకు తగ్గించారు.

    వివరాలు 

    కొండమోడు-పేరేచెర్ల సెక్షన్ విస్తరణ

    కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టుల్లో కొండమోడు-పేరేచెర్ల సెక్షన్ విస్తరణ,నేషనల్ హైవే 167 ఏజీలో 49.917 కిలోమీటర్లను రూ.881.61 కోట్లతో నాలుగు లైన్‌లుగా విస్తరించడం,ఎన్‌హెచ్‌ 167కెలో సంగమేశ్వరం-నల్లకాలువ,వెలిగొండ-నంద్యాల మధ్య 62.571 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 601 కోట్ల వ్యయంతో రెండు లైన్లుగా విస్తరించడం ఉన్నాయి.

    ఎన్‌హెచ్‌ 167కె(కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటించారు)నంద్యాల-కర్నూలు/కడప బోర్డర్ సెక్షన్‌ను 62 కిలో మీటర్ల మేర ఆధునికీకరించేందుకు రూ. 691 కోట్లు కేటాయించారు.

    జాతీయ రహదారి 716జిలోని ముద్దనూరు-హిందూపురం సెక్షన్‌లో 33.58 కిలోమీటర్ల మార్గాన్నిరూ. 808 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

    జాతీయ రహదారి 716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి సెక్షన్‌ వరకు 56.5 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 1,019.97 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

    వివరాలు 

    రూ. 1,321 కోట్లతో రెండు,నాలుగు వరుసల రహదారి

    ఉమ్మడి కడప జిల్లాలో ఎన్‌హెచ్‌-440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు (ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా) ఉన్న 78.95 కిలోమీటర్ల రహదారిని రూ. 1,321 కోట్లతో రెండు, నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.

    జాతీయ రహదారి 516బిలో పెందుర్తి నుంచి ఎస్‌.కోట మార్గంలో ఉన్న 40.5 కిలోమీటర్ల రోడ్డును రూ. 956.21 కోట్లతో 2, 4 వరుసలుగా విస్తరిస్తారు.

    వివరాలు 

    సత్తెనపల్లి, మేడికొండూరుల దగ్గర రెండు బైపాస్ రోడ్లు

    కేంద్రం చేపట్టబోతున్న ఈ ఏడు ప్రాజెక్టుల్లో తొలి రెండు ప్రాజెక్టులకు గతంలోనే టెండర్లు పిలవగా, ఇద్దరు ఎల్‌-1గా నిలిచారు.

    ఆ ప్రాజెక్టులకు సంబంధించి, ఆ రెండు సంస్థలు కోట్ చేసిన మొత్తానికే తాజా ధరలను నిర్ణయించి అంచనాలను ఇప్పటికే సవరించారు.

    కొండమోడు-పేరేచెర్ల రోడ్డు విస్తరణలో భాగంగా దానికి అనుబంధంగా సత్తెనపల్లి, మేడికొండూరుల దగ్గర రెండు బైపాస్ రోడ్లు నిర్మించనున్నట్లు నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

    ఏపీలో ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్ ధర
    Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు పోలీస్
    Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి

    కేంద్ర ప్రభుత్వం

    DPDP విధానాలను రెడీ చేస్తున్న కేంద్రం.. ఆందోళనలో సోషల్ మీడియా కంపెనీలు  సోషల్ మీడియా
    Sanvidhan Hatya Diwas:ఎమర్జెన్సీకి గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం.. జూన్ 25న 'సంవిధాన్ హత్య దివస్'   భారతదేశం
    PM Surya Ghar: బడ్జెట్లో నిధులే నిధులు.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్  నిర్మలా సీతారామన్
    Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిరాశే.. కొత్త రైళ్లు లేవు నిర్మలా సీతారామన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025