కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు కనీసం 10వేలకు పైనే నమోదవున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న రాష్ట్రాలను గుర్తించింది. ఈ మేరకు శుక్రవారం ఆయా రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, దిల్లీలోని ఎన్సీటీ ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
దేశంలో మార్చి 2023 నుంచి కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయని, పాజిటివిటీలో కూడా భారీగా వృద్ధి నమోదైందని, ఇది ఆందోళన కలిగిస్తోందని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు.
కరోనా
మహమ్మారి ఇంకా ముగియలేదు: రాజేష్ భూషణ్
అన్ని జిల్లాల్లో కరోనా నిబంధనలను పటిష్టం అమలు చేయడం నుంచి వైరస్‌పై సామాజిక అవగాహనను మెరుగుపర్చడం వరకు ప్రతి అంశంపై దృష్టి సారించాలని రాజేష్ భూషణ్ లేఖలో సూచించారు.
ప్రజారోగ్య చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తన లేఖలో రాష్ట్రాలను కోరారు.
తగిన స్థాయిలో పరీక్షలను నిర్వహించాలని, ఇన్‌ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం గలిగించే వైరస్‌లపై దృష్టి సారించాలని భూషణ్ రాష్ట్రాలను సూచించారు.
మహమ్మారి ఇంకా ముగియలేదని, ఏ స్థాయిలో కూడా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రం కఠినమైన పర్యవేక్షణను నిర్వహించడం, అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరమని చెప్పారు.