LOADING...
Telangana: వరి కొనుగోలుదారులకు కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు
వరి కొనుగోలుదారులకు కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు

Telangana: వరి కొనుగోలుదారులకు కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీరు వరి సాగు చేసి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉంటే 1967, 180042500333 నంబర్లను మీ వద్ద ఉంచండి. విక్రయంలో ఏ సమస్యలు ఎదురైనా, ఈ టోల్‌ఫ్రీ నంబర్లకు డయల్ చేసి సహాయం పొందవచ్చు. జిల్లాల వారీగా ఏర్పాటయ్యే కంట్రోల్ రూమ్‌లతోపాటు, హైదరాబాద్‌లోని సివిల్ సప్లైస్‌ భవన్ నుంచి కూడా అధికారులు సమస్యలను పరిష్కరించడానికి స్పందిస్తారు.

Details

కింది పరిస్థితుల్లో ఫిర్యాదు చేయవచ్చు

కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి తూకం వేయకపోవడం, తేమ తక్కువ ఉన్నప్పటికీ ధాన్యాన్ని తిరస్కరించడం, తరుగు ఎక్కువగా తీసుకోవడం. కాంటా వేసిన వడ్ల బస్తాలను రైస్ మిల్లర్లకు తరలించడంలో ఆలస్యం, లారీ నుంచి మిల్లర్లు ధాన్యం తీసుకోకపోవడం. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు లభించకపోవడం. నిల్వలో ఉన్న వడ్లు వర్షం కారణంగా తడిచి, కేంద్ర నిర్వాహకులు కొనుగోలు కోసం తిరస్కరించడం. ఈ పరిస్థితుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులను హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు, సమస్యలపై వెంటనే స్పందన తీసుకోవచ్చును.