LOADING...
Deeksha: విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'దీక్ష'.. ఈ యాప్‌తో మరోసారి చదివి, వినొచ్చు
ఈ యాప్‌తో మరోసారి చదివి, వినొచ్చు

Deeksha: విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'దీక్ష'.. ఈ యాప్‌తో మరోసారి చదివి, వినొచ్చు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థి ఎంత తెలివైనవాడైనప్పటికీ, రోజువారీగా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠ్యాంశాలను శ్రద్ధగా వినకపోవడం లేదా విన్నా బిడియంతో సందేహాలను నివృత్తి చేసుకోకున్నా ఆ పాఠం పూర్తిగా అర్థం కాదు. అటువంటి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 'దీక్ష' యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ఉపయోగించి విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో చరవాణి యాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని, పాఠ్య పుస్తకాల్లో ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కావలసిన పాఠ్యాంశాలను పూర్తిగా, సవివరంగా చదవవచ్చు.

వివరాలు 

పాఠశాలలో పాఠం విన్నదాని కంటే అధిక సమాచారం 

ముందుగా గూగుల్ ప్లేస్టోర్ ద్వారా చరవాణి యాప్‌లో 'దీక్ష' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో ప్రవేశించి అవసరమైన వివరాలు నమోదు చేయాలి. పాఠ్య పుస్తకాలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన వెంటనే ఆ పాఠ్యాంశం చరవాణి యాప్‌లో తెరపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దాన్ని విద్యార్థి ఇంటి వద్ద మరోసారి శ్రద్ధగా చదివితే పాఠశాలలో పాఠం విన్నదాని కంటే అధిక సమాచారం ఇందులో పొందవచ్చు.

వివరాలు 

పదివేలకు పైగా డిక్షనరీ పదాలు

"ప్రభుత్వం ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌లను ముద్రించి అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు తమ మొబైల్స్‌లో దీక్ష యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, అందులోని సదుపాయాలతో పాఠ్యాంశాలను పూర్తిగా చదవడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఈ యాప్‌లో కేంద్రంలోని NCERT సిలబస్‌తో పాటు,రాష్ట్ర సిలబస్ పాఠ్యాంశాలూ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆడియో పాఠాలు, పదివేలకు పైగా డిక్షనరీ పదాలు కూడా అందుబాటులో ఉంచారు. ఈ విధంగా విద్యార్థులు ప్రాముఖ్యమైన విషయాలను బాగుగా గ్రహించడానికి వీలు కల్పించారు" అని ఎస్. శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.