Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన
ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు సూర్యాపేట, భద్రాద్రి, వనపర్తి, నారాయణపేట, మెదక్ వంటి జిల్లాలలో ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన వర్షాల కారణంగా అనేక గ్రామాలు విపత్తుకు గురయ్యాయి. బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్న కేంద్ర బృందం తమ ఆర్తిని తీర్చడం, భరోసా ఇవ్వడం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. ఇనుగుర్తి మండలం,మహబూబాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వర్షపాతం 45.6 సెం.మీ. నమోదైంది. ఈ జిల్లాలోని నెల్లికుదురు,చిన్నగూడూరు,మరిపెడ, కురవి, సీరోలు, డోర్నకల్, నర్సింహులపేట మండలాలు వరద భయం నుండి ఇప్పటికీ తేరుకోలేదు. 210 గ్రామాలకు ముంపు బారిన పడగా, అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వాగులు, పెద్ద వంకలేని మహబూబాబాద్ జిల్లా కేంద్రం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
300 పశువులు మృతి
పెద్దఎత్తున ఉన్న చెరువులన్నీ ఒక్కసారిగా అలుగు పోవడం, ఆ వరద ఆకేరు, మున్నేరు నదుల్లో కలవాల్సి ఉండగా ఊర్లలోకి పోటెత్తడం వల్ల జిల్లాలో అపార నష్టం సంభవించింది. 300 పశువులు మృతి చెందినట్లు ఇప్పటివరకు సేకరించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర విపత్తు నిర్వహణ అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించిన జిల్లాల్లో పర్యటించనుంది. తొలుత బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో, అధికారులతో సమావేశం నిర్వహించనుంది. అనంతరం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. అక్కడ బాధితులతో, రైతులతో మాట్లాడనుంది. కేంద్ర బృందం రెండు జట్లుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
రెండు బృందాలుగా క్షేత్రస్థాయి పర్యటన
కేంద్ర విపత్తు నిర్వహణ అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రాష్ట్రంలోని ఇటీవల వరదలు సంభవించిన జిల్లాల్లో పర్యటించనుంది. బుధవారం ఉదయం, రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో, అధికారులతో సమావేశం నిర్వహించి,అనంతరం ఖమ్మం,సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. అక్కడ, బాధితులు,రైతులతో మాట్లాడనుంది. కేంద్ర బృందం రెండు జట్లుగా విడిపోయి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 30,31తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరం తీవ్రంగా కుదేలైంది. సెప్టెంబరు 1వ తేదీ ఉదయానికే నగరాన్ని వరద చుట్టుముట్టడంతో 22కాలనీలు,బస్తీలు మునిగిపోయాయి. మున్నేరు నదికి 37అడుగుల స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. ఆ వరద ఉప్పెనలా దూసుకురావడంతో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది.
1.52 లక్షల మంది వరద ప్రభావితులు
వేల ఇళ్లలోకి వరద చేరింది. ఆ ప్రవాహానికి ఇళ్లలో ఉన్నదంతా కొట్టుకుపోయింది.కాల్వ సమీపంలో నివసించే నిరుపేదల గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నదికి ఒకవైపు ఐదు కిలోమీటర్ల వరకు వరద పోటెత్తింది.నష్టాన్ని అంచనా వేయడానికి సర్వే జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం,1.52 లక్షల మంది వరద ప్రభావితులుగా నమోదు అయ్యారు.15వేల కుటుంబాలు వివిధ స్థాయిలో నష్టపోయాయి. ఖమ్మం గ్రామీణ మండలంలో,గ్రామాలను, చెలకలను, పొలాలను వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా రూపురేఖలు మారిపోయాయి. ఆకేరు ఉద్ధృతికి ఈ మండలంలో వందల ఎకరాల్లో ఇసుక, రాళ్ళు మేటలు వేసాయి. జిల్లాలో పది వేల పశువులు మృతి చెందాయని అంచనా. 66 పాఠశాలల భవనాలు, 50 చెరువులు, 56 వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.