Pemmasani: కరవు ప్రాంతాలకు కేంద్రం ఊరట.. 50 అదనపు పనిదినాలు మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
2025 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా గుర్తించిన అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాలకు కేంద్రం ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా 50 పనిదినాలు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.
వివరాలు
గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఈ అదనపు పనిదినాలు
ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల ప్రతులను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఈ అదనపు పనిదినాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సహాయాన్ని ఆమోదించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన ట్వీట్
Heartfelt thanks to Hon’ble PM Shri @narendramodi Ji for standing firmly with the people of Andhra Pradesh in this hour of need.
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) February 25, 2026
The approval of 50 additional days of employment under Mahatma Gandhi National Rural Employment Guarantee Act for 37 drought-affected mandals in Sri… pic.twitter.com/9p6P74G98A