Loading...
LB Nagar-Hayathnagar Double-Decker Corridor: ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

LB Nagar-Hayathnagar Double-Decker Corridor: ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ ప్రతిపాదనకు గడ్కరీ అంగీకారం తెలిపారు. కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన ప్రతిపాదనకూ కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. అలాగే, జాతీయ రహదారి 765 (NH765)పై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వివరాలు 

ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌ కార్యక్రమానికి గడ్కరీ ఆహ్వానం 

ఇక హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ ప్రతిపాదనపైనా గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు ప్రస్తావనకు వచ్చాయి.

మరోవైపు, హైదరాబాద్‌లో నవంబర్‌ 19 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌ కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని ఆహ్వానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ట్వీట్ 

ADVERTISEMENT