Loading...
atchannaidu: ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలపై కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రైతులకు భారీ ఊరట!
ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలపై కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రైతులకు భారీ ఊరట!

atchannaidu: ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలపై కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రైతులకు భారీ ఊరట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2024 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పెండింగ్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమమైందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన 2024 ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

వివరాలు

దశలవారీగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం

గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వ్యవసాయ శాఖలో పేరుకుపోయిన సమస్యలను కూటమి ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందన్నారు.

రైతులకు అందాల్సిన ప్రయోజనాలు ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో అందేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, 2024 ఖరీఫ్‌ పంటల బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ADVERTISEMENT