Loading...
AP: ఏపీకి కేంద్రం నుంచి కీలక ప్రకటనలు.. పీవీటీజీ గ్రామాలు,రైల్వేలు,మత్స్యరంగానికి ఊతం
3,231 పీవీటీజీ గ్రామాలకు 4జీ మొబైల్‌సేవలు

AP: ఏపీకి కేంద్రం నుంచి కీలక ప్రకటనలు.. పీవీటీజీ గ్రామాలు,రైల్వేలు,మత్స్యరంగానికి ఊతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) పరిధిలో ఉన్న 4,543 గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ఇప్పటికే 3,231 ప్రాంతాలకు 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు.

వివరాలు 

2026-27లో ఏపీకి రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

2009-14 మధ్య కాలంలో ఏటా సగటున రూ.886 కోట్లు మాత్రమే కేటాయించగా, ప్రస్తుతం ఆ మొత్తం 11 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి పలు వివరాలు వెల్లడించారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో చివరి ఐదేళ్లలో ఏటా సగటున 73 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తికాగా, గత 12 ఏళ్లలో ఈ సగటు 147 కిలోమీటర్లకు చేరిందని తెలిపారు.

వివరాలు 

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణానికి రూ.3,407 కోట్లు

ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 12 కొత్త రైల్వే లైన్లు, 30డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

మొత్తం 4,768 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ ప్రాజెక్టుల కోసం రూ.77,855కోట్ల వ్యయాన్ని అంచనా వేశామని వివరించారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని 74రైల్వే స్టేషన్లలో ఇప్పటికే 8 స్టేషన్ల అభివృద్ధి పూర్తయిందని తెలిపారు.

309 కిలోమీటర్ల నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణానికి రూ.3,407 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.2,384 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన 2,258 హెక్టార్ల భూమిలో 1,330 హెక్టార్లను ఇప్పటికే సేకరించామని తెలిపారు.

అలాగే కనిగిరి-వెంకటగిరి రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ఆదాయంలో 32.16% వాటా ఏపీదే

దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న సముద్ర ఆహార ఉత్పత్తుల ద్వారా లభిస్తున్న మొత్తం ఆదాయంలో 32.16 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతున్నట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు.

బుధవారం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు సానా సతీశ్‌బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా,గత ఐదేళ్లలో 12 రాష్ట్రాల నుంచి 85,56,340 మెట్రిక్ టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి కాగా,వాటి ద్వారా రూ.3,18,378.42 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 17,76,447 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను ఎగుమతి చేసి రూ.1,04,313 కోట్ల ఆదాయం సాధించినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

విశాఖ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ డీపీఆర్‌కు వేగం

మరో ప్రశ్నకు సమాధానంగా,ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.58.60 కోట్లు మంజూరు చేయగా,అందులో రూ.28.27 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ ప్రశ్నను తెలుగుదేశం పార్టీ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగారు. విశాఖపట్టణంలో ప్రతిపాదిత మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ పనులను ఈ ఏడాది ఏప్రిల్ 23న అప్పగించినట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఈ డీపీఆర్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన వెల్లడించారు.

వైకాపా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

ADVERTISEMENT