Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ
ఈ వార్తాకథనం ఏంటి
నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ఐదు జిల్లాల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భూములు సేకరించనున్నారు. ఈ పనులను ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది.
వివరాలు
ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లు
నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మొత్తం 205 కిలోమీటర్ల పొడవున మూడో, నాలుగో రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లు ఇప్పటికే ఉన్నాయి. అయితే ప్రయాణికుల రైళ్లు, సరకు రవాణా రైళ్ల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ అదనంగా మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. దీంతో రైళ్ల రాకపోకలు మరింత సులభం కానున్నాయి.