కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం
భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుస పర్యటనల నేపథ్యంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నిధుల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు 3వ విడత కేంద్ర జీఎస్టీ పన్నుల నిధులను విడుదల చేసింది. జూన్ నెలకు గానూ 3వ విడత కింద కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాగా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో మొత్తం రూ.1,18,280 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. జూన్ చెల్లింపులతో పాటు ఒక విడత అడ్వాన్స్ ను అందించినట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఏపీకి రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లను కేటాయించింది.
అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ కు రూ.21,218 కోట్లు రిలీజ్
1. ఉత్తర్ ప్రదేశ్ కు రూ.21,218 కోట్లు 2. ఆంధ్ర ప్రదేశ్ - రూ.4,787 కోట్లు 3. తెలంగాణ - రూ.2,486 కోట్లు 4. అరుణాచల్ ప్రదేశ్ - రూ.2,078 కోట్లు 5. అస్సాం - రూ.3,700 కోట్లు 6. బిహార్ - రూ.11,897 కోట్లు 7. ఛత్తీస్ గఢ్ - రూ.4,030 కోట్లు 8. గోవా - రూ.457 కోట్లు 9. గుజరాత్ - రూ.4,114 కోట్లు 10. హర్యానా - రూ.1,293 కోట్లు 11. హిమాచల్ ప్రదేశ్ - రూ.982 కోట్లు 12. ఝార్ఖండ్ - రూ.3,912 కోట్లు 13. కర్ణాటక - రూ.4,314 కోట్లు
పెద్ద రాష్ట్రాలకు అధిక నిధులు
14. కేరళ - రూ.2,277 కోట్లు 15. మధ్యప్రదేశ్ - రూ.9,285 కోట్లు 16. మహారాష్ట్ర - రూ.7,472 కోట్లు 17. మణిపూర్ - రూ. కోట్లు 18. మేఘాలయ - రూ. కోట్లు 19. మిజోరం - రూ. కోట్లు 20. నాగాలాండ్ - రూ.673 కోట్లు 21. ఒడిశా - రూ.5,356 కోట్లు 22. పంజాబ్ - రూ.2,137 కోట్లు 23. రాజస్థాన్ - రూ.7,128 కోట్లు 24. సిక్కిం - రూ.459 కోట్లు 25. తమిళనాడు - రూ.4,825 కోట్లు 26. త్రిపుర - రూ.8,37 కోట్లు 27. ఉత్తరాఖండ్ - రూ.1,322 కోట్లు
విభజన చట్టం, నీతి ఆయోగ్ సిఫార్సులతోనే ఏపీకి ఆర్థిక సాయం : కేంద్రం
28. పశ్చిమ బెంగాల్ - రూ.8, 898 కోట్లు మొత్తం - రూ.1, 18, 280 కోట్లను విడుదల చేసిన కేంద్రం. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం మేర వాటాను రాష్ట్రాలకు అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపు 14 విడతల్లో రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేస్తుంది. అయితే విడుదలైన ఆయా నిధులను అభివృద్ధి పథకాలను మరింత వేగం చేసేందుకు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఏపీకి విభజన చట్టం హామీ ప్రకారం ఇప్పటివరకు రూ.23,110.47 కోట్ల సాయం పంపిణీ చేశామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. విభజన చట్టం నిబంధనలు, నీతి ఆయోగ్ సిఫార్సులతోనే ఆర్థికసాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.