Page Loader
Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ ట్విస్ట్, కేసు రేపటికి వాయిదా
కేసు రేపటికి వాయిదా

Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ ట్విస్ట్, కేసు రేపటికి వాయిదా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 22, 2023
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసులో సీఐడీ ట్విస్ట్ ఇచ్చింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారులను టీడీపీ నేత నారా లోకేశ్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో సీఐడీ శుక్రవారం మెమో దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడి కేసులను విచారిస్తున్న అధికారులపై తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేశ్ అంటున్న విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

details

ఏసీబీ కోర్టులోనూ ఇలాంటి పిటిషనే దాఖలు 

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది. ఇదే సమయంలో లోకేశ్ పై చర్యలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, మెమోపై లోకేశ్ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. అలాగే, బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయమే చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలను కోర్టులో సమర్పించారు. మరోవైపు, విజయవాడ ఏసీబీ కోర్టులోనూ సీఐడీ ఇటువంటి పిటిషన్నే దాఖలు చేసింది. ఇరు పక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.