
Chandrababu: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.
ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.
అయోధ్య రామజన్మభూమి ఆలయంలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు చంద్రబాబుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపారు.
ఈ నెల 16 నుంచి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
16 నుంచి 21 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి 18న ఆలయ గర్భగుడిలో రామలల్ల విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది.
22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
22న అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు
*అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్టకు టీడీపీ అధినేత @ncbn ఆహ్వానం - 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం - చంద్రబాబుకు ఆహ్వానం పంపిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు* pic.twitter.com/vHZdKtSFdd
— AP_HOPE_CBN___. (@ap_hope_cbn___) January 17, 2024