Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) చర్చిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ ఎస్‌ఐపీబీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 37ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలు బోర్డు పరిశీలనకు వచ్చాయి. వీటి ద్వారా దాదాపు రూ.2.08లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు,పెట్టుబడుల వివరాలు,సంబంధిత అంశాలపై 20వ ఎస్‌ఐపీబీ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు,నారాయణ,టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం ప్రారంభం
Andhra CM Chandrababu Naidu chairs 20th meeting of State Investment Promotion Board (SIPB) in Amaravati to review investment proposals worth about ₹2.08 lakh crore across 37 projects. pic.twitter.com/RlHepJnY4i
— News Arena India (@NewsArenaIndia) August 12, 2026