Loading...
Balakrishna: గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్
గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్

Balakrishna: గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఫోన్‌లో ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ అదే ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నానని చంద్రబాబు 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు. మరోవైపు,మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి నారా లోకేశ్‌కు బాలకృష్ణ గాయపడిన విషయం తెలియగానే వెంటనే ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలుసుకుని, త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ కూడా బాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఎక్స్‌' వేదికగా చంద్రబాబు చేసిన పోస్ట్ 

ADVERTISEMENT