Loading...
Chandrababu Naidu: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కూటమి గెలుపుపై ధీమా
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కూటమి గెలుపుపై ధీమా

Chandrababu Naidu: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కూటమి గెలుపుపై ధీమా

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు, రెండో దశ పట్టణ స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఈసారి మరింత ఎక్కువ ఓట్లు సాధించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కూటమి ఐక్యతను, క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని నిరూపించుకునే అవకాశమని పేర్కొన్నారు.

Details

కూటమి పార్టీల మధ్య ఐక్యతే అసలైన బలం

ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తెలుగుదేశంపార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక స్థాయిలో చిన్నపాటి విభేదాలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులు రాకుండా నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Details

ఒక్క వార్డులో ఓడినా కారణాలు పరిశీలన

ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఒక్క వార్డులో ఓటమి ఎదురైనా దానికి గల కారణాలను విశ్లేషిస్తానని స్పష్టం చేశారు.

గ్రామాలు, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న ఐక్యత, పార్టీ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

స్థానికంగా ప్రజలతో నాయకులు ఎంతవరకు మమేకమవుతున్నారనే అంశం కూడా కీలకమని ఆయన దిశానిర్దేశం చేశారు.

ADVERTISEMENT

Details

వ్యక్తిగత విమర్శలకు వాస్తవాలతోనే సమాధానం

రాజకీయాల పేరుతో వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించే వారికి ప్రజలే సమాధానం చెప్పేలా వాస్తవాలను వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ప్రభుత్వ పనులు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

మొత్తంగా స్థానిక ఎన్నికలను కూటమి ఐక్యతకు పరీక్షగా భావిస్తున్న చంద్రబాబు, 2024లో వచ్చిన విజయాన్ని మించి ఫలితాలు సాధించే దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

ADVERTISEMENT