నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఖమ్మం తరహాలో నిజామాబాద్‌లో మరో భారీ బహిరంస సభకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమచారం. ఈ సభకు కనీసం లక్ష మంది వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ బహిరంగ సభకు తేదీ ఖరారు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
వరంగల్, మహబూబ్‌నగర్‌లోనూ సభలు!
నిజామాబాద్‌లో చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందట. సభ నేపథ్యంలో టీడీపీని వీడిన వారిని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేపడుతున్నట్లు సమాచారం. పార్టీలోకి వచ్చే నేతలకు టికెట్లతోపాటు పార్టీలో పదవులు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే నిజామాబాద్‌కు చెందిన ముఖ్య నేతలతో సమావేశమై.. చర్చించారట. వరంగల్,మహబూబ్‌నగర్‌లో కూడా భారీ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీలోకి మాజీ నేతలు వస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చాలామంది నేతలు టీడీపీ నుంచి వెళ్లిన వారే. ఆ నేతలు తిరిగి తమ సొంతగూటికి వస్తారా? రారా? అనేది కాలమో నిర్ణయిస్తుంది.