
Skill Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా.. మరింత సమయం కోరిన ప్రభుత్వ లాయర్లు
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.ఈ మేరకు ఈనెల 15కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదే సమయంలో విచారణకు అదనపు ఏజీ హాజరుకాలేకపోతున్నారని సీఐడీ స్పెషల్ పీపీ వివేకానంద కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు మరింత సమయం కావాలని కోరారు.అనుమతించిన ఏపీ హైకోర్టు న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
అనంతరం విచారణను ఈ నెల 22కి వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (పీపీ) కోరారు.
స్పందించిన కోర్టు, అభ్యర్థనను తోసిపుచ్చుతూ, మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేయగా తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.
details
సుప్రీంలో ఇదీ జరిగింది :
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీపావళి సెలవుల తర్వాత తీర్పు ఇస్తామని సుప్రీం స్పష్టం చేసింది.
మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి వాయిదావేసింది.
ఈ నెల 13 నుంచి 18 వరకు కోర్టుకు దీపావళి సెలవులు ఉన్నాయి. ఇదే సమయంలో 19న ఆదివారం సెలవు దినంగా ఉండనుంది.
దీంతో ఈనెల 20న కోర్టు పునఃప్రారంభమవుతుంది. ఈ మేరకు వారంలో స్కిల్ కేసు తీర్పు వెలువడనున్నట్లు న్యాయవాదులు అంచనా వేస్తున్నాయి.
details
గురునారం ధర్మాసనం ముందుకు SLP పిటిషన్
ఫైబర్‌నెట్ కేసులో ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) పిటిషన్ గురువారం ధర్మాసనం ముందుకు వచ్చింది.
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌పై తీర్పును ఇదివరకే తాము రిజర్వు చేశామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పింది.
దీపావళి సెలవుల తర్వాతే దీన్ని విచారించే అవకాశాలున్నాయని జస్టిస్ బోస్ తెలిపారు. ఫైబర్‌నెట్ కేసులోనూ అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌కు సంబంధించి సారూప్య అంశాలు ఉన్నాయన్నారు. అందువల్ల స్కిల్ కేసులో తీర్పునిచ్చాకే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారిస్తామని పేర్కొన్నారు.