Page Loader
Advance Booking: రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!
రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

Advance Booking: రైలు టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రైల్వే బోర్డు రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు 60 రోజులలోపు ప్రయాణానికే టికెట్లను ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి 120 రోజుల గడువు నిబంధన యధావిధిగా వర్తిస్తుంది. 2015 మార్చి 25లో 60 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌ను 120 రోజులకు పెంచినప్పటికీ, ఈ మార్పుతో క్యాన్సలేషన్లు అధికంగా ఉండటం వల్ల బెర్త్‌లు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డు గుర్తించింది.

Details 

గడువును తగ్గించిన రైల్వే బోర్డు

ప్రస్తుతం 21 శాతం టికెట్లు క్యాన్సలవుతున్నాయి. అందులో 4-5 శాతం ప్రయాణికులు టికెట్లు క్యాన్సెల్ చేయకుండానే ప్రయాణం రద్దు చేసుకుంటున్నట్లు నివేదికలో వెల్లడించారు. అసలైన ప్రయాణికులకు టికెట్లు సులభంగా లభించేందుకు ఈ గడువును తగ్గించినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మార్పులు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి తక్కువ కాల పరిమితి ఉన్న రైళ్లకు వర్తించవు విదేశీయులు 365 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు.