
Chennai: BMW కారుతో ఢీ.. ఒకరి మృతి.. నిందితురాలి అరెస్ట్,బెయిల్ పై విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు (YCP MP Beeda Masthan Rao) కూతురు మాధురి అరెస్టు అయ్యారు.
బిసెంట్ నగర్ లో ఎంపీ కూతురు నడుపుతున్న కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే అక్కడే సూర్య అనే యువకుడు నిద్రిస్తున్నాడు.
అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు సోమవారం సాయంత్రం BMW కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు సూర్య భార్య వినిత కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మాధురిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు.
ప్రమాద దృశ్యం
ఎలా కనుగొన్నారంటే
ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపిన మాధురి, ఆమె స్నేహితురాలు అంబులెన్స్ కు ఫోన్ చేశారు.
స్థానికులు వచ్చి ప్రశ్నించడంతో మాధురి ఫ్రెండ్ వాదనకు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అంబులెన్స్ కు కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు మాధురిని కనుకొన్నారు.
మే లో
పూణె పోర్షే ప్రమాదం దేశంలో దుమారం రేపుతోంది
మే 19వ తేదీ తెల్లవారుజామున పూణెలో 17 ఏళ్ల యువకుడు నడుపుతున్నట్లు ఆరోపిస్తూ వేగంగా వస్తున్న పోర్స్చే మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది .
దీంతో ఇద్దరు ఐటీ నిపుణులు, మరణించారు. ఆ సమయంలో యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.
అయితే, ట్రాఫిక్ ప్రమాదాలపై 300 పదాల వ్యాసాన్ని రాయడం సహా కొన్ని షరతులపై సంఘటన జరిగిన 15 గంటల తర్వాత జువైనల్ జస్టిస్ బోర్డు యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.
విమర్శల నేపథ్యంలో యువకుడిని జూన్ 5 వరకు ఎరవాడలోని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు.