Page Loader
Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 
మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం

Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2024
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో సోమవారం నాడు మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన విగ్రహం కూలిపోయింది. ఈ మేరకు ఓ అధికారి సమాచారం ఇచ్చారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట సమయంలో విగ్రహం కూలిపోయిందని అధికారి తెలిపారు. విగ్రహం కూలిపోవడానికి అసలు కారణాన్ని నిపుణులు కనుగొంటారని చెప్పారు. అయితే గత రెండు మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపారు. గతేడాది డిసెంబరు 4న నేవీ డే వేడుకల సందర్భంగా అట్టహాసంగా ఆవిష్కరించిన 35 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

వివరాలు 

కాంట్రాక్టర్,నిర్మాణ సలహాదారుపై ఎఫ్‌ఐఆర్ నమోదు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో సోమవారం 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూలిన ఘటనలో కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. "ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఘటనలో కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై స్థానిక పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109, 110, 125, 318, 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు" అని సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు. 8 నెలల క్రితం నేవీ డే రోజున ఆవిష్కరించిన ఈ విగ్రహం సింధుదుర్గ్ పౌరులకు అంకితం చేయబడింది. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలిస్తామని భారత నౌకాదళం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

 ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పునఃస్థాపిస్తాం: షిండే 

బలమైన గాలుల కారణంగానే విగ్రహం కూలిపోయిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. విగ్రహం కూలిపోయిన ఘటన వెనుక గల కారణాలను మహారాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టి, అదే స్థలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పునఃస్థాపిస్తుందని షిండే తెలిపారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ విగ్రహాన్ని నౌకాదళం ఏర్పాటు చేసింది. వారే డిజైన్ కూడా చేశారు. కానీ గంటకు 45 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయడంతో అది పడిపోయి దెబ్బతిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే పబ్లిక్ వర్క్స్ మంత్రి రవీంద్ర చవాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి షిండే ఆదేశాల మేరకు విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను పరిశీలించారు.