Tamil Nadu: తమిళనాడులో సీఏఏను అమలు చేయబోం: సీఎం స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక కామెంట్స్ చేశారు. సీఏఏ చట్టం కేవలం విభజనను సూచిస్తుందని స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఎజెండాలో పౌరసత్వ చట్టం ఆయుధంగా మారిందన్నారు. ముస్లింలు, శ్రీలంక తమిళులకు ద్రోహం చేయడం ద్వారా మోదీ సర్కారు విభజనకు బీజాలు నాటారాన్ని పేర్కొన్నారు. డీఎంకే ప్రజాస్వామ్య శక్తులు వ్యతిరేకించినప్పుటికీ, బీజేపీ తొత్తుగా ఉన్న ఏడీఎంకే మద్దతుతో సీఏఏను కేంద్రం తీసుకొచ్చిందని స్టాలి మండిపడ్డారు. ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతో బీజేపీ ఈ చట్టాన్ని ఇన్ని రోజులు కోల్డ్ స్టోరేజీలో ఉంచిందన్నారు.