అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు ఎలాంటి హక్కుల్లేవ్, అది భారతదేశంలో భాగమే
చైనా పోకడపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ విరుచుకుపడ్డారు. అరుణాచల్ పై డ్రాగన్ దేశానికి ఎలాంటి హక్కులు లేవన్నారు. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రం భారతదేశంలో అంతర్బాగమేనని పునరుద్ఘాటించారు. పూర్వకాలంలోనూ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడూ చైనాలో భాగమని చారిత్రక ఆధారాలు లేవని ఖండూ తేల్చిచెప్పారు. గత నాలుగేళ్లుగా వాస్తవ నియంత్రణ రేఖ (LINE OF ACTUAL CONTROL) వద్ద బీజింగ్ దూకుడుగా వ్యవహరిస్తుండటంపైనా ఖండూ మండిపడ్డారు. ఇటీవలే చైనా తమ రాష్ట్రం పేరు మార్చడం, తమ మ్యాపులో భాగంగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తవాంగ్‌లో 36వ సీనియర్ నేషనల్ టగ్ ఆఫ్ వార్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు.