LOADING...
Maldives row: మాల్దీవుల్లో సినిమాలు చిత్రీకరించొద్దు: నిర్మాతలకు సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి 
Maldives row: మాల్దీవుల్లో సినిమాలు చిత్రీకరించొద్దు: నిర్మాతలకు సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి

Maldives row: మాల్దీవుల్లో సినిమాలు చిత్రీకరించొద్దు: నిర్మాతలకు సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి 

వ్రాసిన వారు Stalin
Jan 15, 2024
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాల్దీవులు, భారత్ మధ్య దౌత్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రలు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశంలో ఎలాంటి సినిమాలను చిత్రీకరించవద్దని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWA) బాలీవుడ్ నిర్మాతలను కోరింది. ఈ మేరకు సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా సెలవుల్లో మాల్దీవులకు వెళ్లొద్దని, బదులుగా భారతీయ దీవులను ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 15లోగా భారత సైన్యాన్ని తమ దీవుల నుంచి ఉపసంహరించుకోవాలని మాల్దీవులు ప్రభుత్వం భారత్‌ను కోరిన ఒక రోజు తర్వాత సినీ కార్మిక సంఘం ఈ తాజా ప్రకటన చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూనియన్ ప్రెసిడెంట్ విడుదల చేసిన వీడియో