Loading...
Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తోసుకుంటూ పరుగు యువకుడి పరుగు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తోసుకుంటూ పరుగు యువకుడి పరుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే విమానాశ్రయంలోని టెర్మినల్‌-3లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బందిని తోసుకుంటూ లోపలికి పరుగులు తీశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన 25 సెకన్ల వీడియోను సీఐఎస్ఎఫ్ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది.

వివరాలు 

తనిఖీలను దాటుకుని వెళ్లేందుకు యత్నం

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-3 ప్రవేశ ద్వారం వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికుల తనిఖీలు చేపడుతున్నారు.

ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడిని విమానాశ్రయంలోకి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ పత్రాలు చూపించాలని భద్రతా సిబ్బంది కోరారు.

అయితే అతడు పత్రాలు చూపించకుండా ఒక్కసారిగా సిబ్బందిని దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది యత్నించినప్పటికీ వారిని తోసుకుంటూ పరుగులు తీశాడు.

వివరాలు 

తనిఖీలను దాటుకుని వెళ్లేందుకు యత్నం

దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) రంగంలోకి దిగింది.

యువకుడిని వెంబడించిన సిబ్బంది కొద్దిసేపటికే అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు.

అందులో కొన్ని గుర్తింపు కార్డులు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు లభించాయి. వాటి ఆధారంగా అతడు హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఢిల్లీ పోలీసులకు అప్పగింత.. దర్యాప్తు

యువకుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనతో విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే యువకుడు విమానాశ్రయంలోని భద్రతా తనిఖీలను దాటి లోపలికి వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడు? దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఐఎస్ఎఫ్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT