LOADING...
Ration Card: రేషన్ కార్డుదారులు పౌరసరఫరాల శాఖ అలెర్ట్..  ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి
ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి

Ration Card: రేషన్ కార్డుదారులు పౌరసరఫరాల శాఖ అలెర్ట్..  ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ కార్డులు పొందారు. మరికొందరూ దరఖాస్తు చేసుకోగా... పరిశీలన దశలో ఉన్నాయి. పాత రేషన్ కార్డులలో కూడా పేర్లను నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది,ఇది ప్రధానంగా మీ-సేవా ద్వారా పూర్తి చేస్తున్నారు. కొత్తగా కార్డు పొందిన వారు, పాత కార్డులో పేర్లు నమోదు చేసుకున్న వారు ప్రతీ నెలా రేషన్ పొందుతున్నారు. అయితే, ఇటీవలే నమోదైన వారు ఎక్కువగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం గమనార్హం. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే పలు సందేశాల ద్వారా రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.

వివరాలు 

తప్పనిసరిగా చేసుకోవాల్సిందే…!

ఇటీవలే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. ఈకేవైసీ చేసుకోకపోతే జనవరి నుంచి రేషన్ కట్ చేస్తారని ఇందులో ఉంది. ఇదే అంశంపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశంపై పౌరసరఫరాలశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ-కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని... కార్డులు రద్దు అవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా సమీపంలోని రేషన్ షాపు వద్దకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వేలిముద్రలతో సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ వివరాలు, ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం అవసరం.

వివరాలు 

ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టడానికి ముఖ్య కారణం..

వేలిముద్రలు అందకపోతే, ఐరిష్ ఆధారంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ బియ్యం అందే అవకాశం కల్పించడం, అక్రమ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం. కాబట్టి...ఈ విషయంపై పౌరసరఫరాలశాఖ అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement