Loading...
CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు
జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు

CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లను వినిపించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో సుమారు పది నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, లీకేజీల నివారణ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రూపొందించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.

వివరాలు 

డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టీకరణ

సమావేశం అనంతరం సౌరవ్ దాస్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో అంతర్గతంగా చర్చిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు.

అయితే తమ డిమాండ్లపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదా నిర్దిష్ట హామీ లభించలేదని వెల్లడించారు.

డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సీజేపీ 'పార్లమెంట్ ముట్టడి'కి పిలుపునివ్వడంతో జంతర్ మంతర్ ప్రాంతానికి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

అక్కడి నుంచి పార్లమెంట్ వైపు కదిలేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

వివరాలు 

సోనం వాంగ్‌చుక్ సుదీర్ఘ నిరాహార దీక్ష

ఆప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు నిరసనకారులు ముందుకు సాగేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కొన్నిచోట్ల లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు.

సోషల్ మీడియాలో వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు,సాంకేతిక వైఫల్యాలు,పరీక్షల నిర్వహణలో లోపాలపై నిరంతరంగా ఉద్యమం కొనసాగిస్తోంది.

ఈపోరాటానికి సంఘీభావంగా పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు.

ఆందోళనలు ప్రారంభమైన తర్వాత సీజేపీ నాయకులతో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తమ అన్ని డిమాండ్లు అమలులోకి వచ్చే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని సీజేపీ నాయకత్వం మరోసారి స్పష్టం చేసింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నీట్ వివాదంపై కేంద్రమంత్రి నడ్డాతో భేటీ

ADVERTISEMENT