CJP-Centre Talks: కేంద్రంతో సీజేపీ చర్చలు.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం కీలక దశకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన పార్టీ నాయకత్వం కోరిన తటస్థ వేదిక ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించినట్లు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. దీంతో శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం,సీజేపీ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. గురువారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన సౌరవ్ దాస్,చర్చలకు ఆహ్వానం అందిందని తెలిపారు. సమావేశాన్ని తటస్థ వేదికలో నిర్వహించాలని పార్టీ కోరగా,ప్రభుత్వం కూడా అందుకు సమ్మతించిందని చెప్పారు. ఇరు పక్షాల అంగీకారంతో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను సమావేశ వేదికగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
వివరాలు
తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఇటీవల నిరసనలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలకు ఆహ్వానించినప్పటికీ, కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల్లో జరిగే సమావేశాలకు తాము హాజరుకాబోమని సీజేపీ స్పష్టం చేసింది.
జంతర్ మంతర్‌లో లేదా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన తటస్థ ప్రదేశంలోనే చర్చలు జరగాలని పార్టీ పట్టుబట్టింది.
అనంతరం భద్రతా కారణాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా జరిగిన వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు,యువతలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, విద్యా వ్యవస్థలో పారదర్శకత లోపం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ సీజేపీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది.
వివరాలు
కేంద్రం-సీజేపీ చర్చలు ప్రాధాన్యం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు, అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం వంటి ప్రధాన డిమాండ్లతో పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది.
ఇదిలా ఉండగా, పరీక్షా పేపర్ లీకుల కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
అయితే, అది తమ ప్రధాన డిమాండ్లకు పూర్తి స్థాయి పరిష్కారం కాదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న కేంద్రం-సీజేపీ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ సమావేశంలో ఉద్యమకారుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీజేపీ-కేంద్రం మధ్య నేడు చర్చలు.. తటస్థ వేదికకు ప్రభుత్వ ఓకే
#WATCH | Delhi: Saurav Das, Chief Spokesperson, Cockroach Janta Party, says, "... Tomorrow, a discussion has been called for, we are very happy that the government has agreed to our request that it be at a neutral venue. The Constitution Club of India has been chosen..." (23.07) pic.twitter.com/MoK1DgdgJ5
— ANI (@ANI) July 24, 2026