TG inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీపై క్లారిటీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరడంతో, ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలను ప్రకటించే దిశగా చర్యలు వేగవంతం చేసినట్లు సమాచారం. బోర్డు వర్గాల ప్రకారం, ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
వివరాలు
అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
అయితే ఖచ్చితమైన తేదీ, సమయం విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన tgbie.cgg.gov.in మరియు results.eenadu.netలో తమ హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు.