భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం
వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్‌లోని 1,091 పక్షి జాతులపై 'ప్రొజెక్టెడ్ షిఫ్ట్స్ ఇన్ బర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అండర్ క్లైమేట్ చేంజ్' పేరుతో నలుగురు పరిశోధకులు చేసిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. 2070నాటికి వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా 1,091పక్షి జాతుల్లో 66 నుంచి 73% పక్షులు ఎక్కువ ఎత్తులతో పాటు ఉత్తరం వైపుకు వాటి గమ్యాన్ని మార్చుకునే అవకాశం ఉందని అధ్యయనం చెప్పింది. పరిశోధకులు అర్పిత్ దేవమురారి, అజయ్ శర్మ, దీపాంకర్ ఘోష్, రణదీప్ సింగ్ భారతదేశంలోని జీవవైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేశారు. 1,091పక్షి జాతుల్లో 58-59%జాతులు భూమి పరిధిలో వాటి భాగాన్ని కోల్పోతాయని పరిశోధకులు నిర్ధారించారు. 41-40% జాతుల పరిధులు పెరుగుతాయని అంచనా వేశారు.
సుదూర వలస పక్షలకు హానీ ఎక్కువ
'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా'కు చెందిన ప్రధాన పరిశోధకుడు డియోమురారి మాట్లాడుతూ.. 2500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో పక్షి జాతుల వైవిధ్యం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. 2070 నాటికి పశ్చిమ హిమాలయాలు, సిక్కిం, ఈశాన్య భారతదేశం, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో జాతుల సమృద్ధిలో విస్తృతమైన మార్పులను అధ్యయనం అంచనా వేసినట్లు చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావం పాక్షికంగా వలస పక్షలపై ఉన్నట్లు తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల సుదూర వలస పక్షుల నివాసాలపై ఎక్కువ హానీ కలిగిస్తాయని పరిశోధకులు అంచనా వేశారు. జాతుల వైవిధ్యం ఎత్తుతో ఎలా మారుతుందో కూడా పరిశోధకులు ట్రాక్ చేశారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి