1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు
దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానాన్ని ఓ పక్షి బలంగా ఢీకొట్టడంతో శనివారం మధ్యాహ్నం ఆ ఫ్లైట్‌ను దిల్లీ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లో పక్షి ఢీకొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యేలా ముందస్తు అనుమతి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విమానాన్ని పక్షులు ఢీకొన్న ఘటనలను తేలికగా తీసుకోలేం: అధికారులు
దాదాపు 1000 అడుగుల ఎత్తులో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అయితే విమానాన్ని పక్షులు ఢీకొన్న ఘటనలను తేలికగా తీసుకోలేమని పేర్కొన్నారు. అవి పెద్ద సాంకేతిక సమస్యకు దారి తీస్తాయని, ప్రయాణికుల ప్రాణాలకు హాని కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదని వివరించారు. ఫిబ్రవరిలో సూరత్ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో పక్షులు ఢీ కొట్టడంతో దాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించాల్సి వచ్చింది. ఆ విమానాన్ని అహ్మదాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.