Page Loader
మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్
మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు

మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్

వ్రాసిన వారు Stalin
Apr 01, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకాక్‌ నుంచి ముంబయికి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ఓ స్వీడన్‌ ప్రయాణికుడు వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగిన వెంటనే ముంబయి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో 24 ఏళ్ల క్యాబిన్ సిబ్బందిని వేధించినందుకు 62 ఏళ్ల ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ అనే స్వీడిష్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 6ఈ-1052 ఇండిగో ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. అలాగే తోటి ప్రయాణికుడిపై కూడా స్వీడిష్ దేశస్థుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

విమానం

గత మూడు నెలల్లో ఇది ఎనిమిదో ఘటన

భోజనం వడ్డిస్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్‌తో వెస్ట్‌బర్గ్ అనుచితంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం లేదని విమాన సహాయకురాలు తెలియజేయడంతో ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ అనుచితంగా ప్రవర్తించాడు. అనంతరం ఎరిక్ చికెన్ డిష్ తీసుకోవడానికి అంగీకరించాడు. ఆ తర్వాత నగదు చెల్లింపు చేయడానికి ఎయిర్ హోస్టెస్ పీఓఎస్ మెషీన్‌తో అతని దగ్గరికి వెళ్లింది. అయితే అతను కార్డ్ స్వైప్ చేయాలనే సాకుతో ఆమె చేయి పట్టుకొని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జరగ్గా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో గత మూడు నెలల్లో ఇది విమానాల్లో వికృత చేష్టలకు సంబంధించి ఇది ఏడో ఘటన కావడం గమనార్హం.