CM Chandrababu: అమరావతి నిర్మాణానికి నిధుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు దేశ రాజధాని దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి, 6.30 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు.
ఇక రాత్రికి ఇద్దరు దిల్లీలోనే బస చేయనున్నారు.
Details
బుధవారం ముఖ్య కార్యక్రమాలు
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
బుధవారం దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధానితో సమావేశమవుతారు.
అమరావతి నిర్మాణ పునఃప్రారంభానికి ఆహ్వానం
రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు.
నిధుల అంశంపై చర్చ
అమరావతి నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలతో పాటు ఇతర కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం
పలు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలసి రాష్ట్రానికి అవసరమైన మద్దతును కోరనున్నారు.
బుధవారం రాత్రి తిరుగు ప్రయాణం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.
Details
ఏపీ శాసనసభ సమావేశాలు
బుధవారం ఉదయం 9 గంటలకు ఏపీ శాసనసభ 13వ రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కాలువల ఆక్రమణలు, ప్రైవేట్ పాఠశాల భద్రత చర్యలు, బుడమేరు ఆక్రమణ, సూపర్ సిక్స్ పథకాలు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి.
ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకుని, 2.30 గంటల వరకు సమావేశాల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు.
3.30 నుంచి 4 గంటల వరకు మైనింగ్ విభాగంపై సమీక్ష నిర్వహించి, అనంతరం దిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు.