
CM Chandrababu Serious: అసెంబ్లీలో కామినేని-బాలయ్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా కొనసాగుతున్నాయి. సభలో మొత్తం అధికార కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే ఉన్నప్పటికీ, హాట్‌టాపిక్‌లతో రాజకీయ వేడి పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం లేకపోయినా, కూటమి ఎమ్మెల్యేల తీరే ఇప్పుడు ఆ కూటమిలో చిచ్చు రేపుతున్నట్టుగా మారింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వివాదానికి దారితీయగా, ఇప్పుడు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ స్పందన మరింత రచ్చకు కారణమయ్యాయి. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని సమాచారం.
Details
బొండా ఉమాపై సీఎం అసంతృప్తి
ముఖ్యంగా బోండా ఉమ వ్యవహారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అసలు సభ సజావుగా సాగడానికి దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయోనని చంద్రబాబు చీఫ్ విప్, మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రశ్నించినట్టు చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్‌పై కూడా సీఎం తీవ్రంగా స్పందించారు.
Details
స్పందించిన చిరంజీవి
అదేవిధంగా కొంతమంది అధికారుల బదిలీల విషయాన్ని సభలో ప్రస్తావించడంపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వ కాలంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సందర్భంపై కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ స్పందించడంతో ఈ వ్యవహారం కామినేని వర్సెస్ బాలయ్యగా మారింది. అయితే మధ్యలో వైఎస్ జగన్, చిరంజీవి పేర్లు రావడంతో, చివరకు చిరంజీవి కూడా దీనిపై స్పందించిన విషయం తెలిసిందే.