LOADING...
Chandrababu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్ర‌బాబు మూడు రోజుల యూఏఈ పర్యటన
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్ర‌బాబు మూడు రోజుల యూఏఈ పర్యటన

Chandrababu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్ర‌బాబు మూడు రోజుల యూఏఈ పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు యూఏఈకు విమానం బయలుదేరనుంది. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో,యూఏఈలో మూడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యే విధంగా ప్రణాళిక చేశారు. అదేవిధంగా, ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక సైట్ విజిట్‌లో కూడా పాల్గొననున్నారు. ఈ సైట్ విజిట్‌లో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది.

వివరాలు 

యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ 

పర్యటన తొలి రోజు మొత్తం ఐదు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాత్రి, సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో కూడా ఆయన పాల్గొననున్నారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. పర్యటన ముగింపు రోజున, దుబాయ్‌లో ఏపీ ఎన్ఆర్‌టి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. తొలి రోజు పర్యటనలో శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి ఐదు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కూర్చుకుంటారు. వీరితో ఆయన ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు.