
రాజస్థాన్: అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. సీఎం గెహ్లాట్, పైలట్ పోటీ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్‌పురా నియోజకవర్గం నుంచి, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ బరిలోకి దిగుతున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా లచ్మాన్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి నాథ్‌ద్వారా స్థానాన్ని కేటాయించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది.
అశోక్ గెహ్లాట్ బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి జాబితా
राजस्थान में होने वाले विधानसभा चुनाव, 2023 के लिए भारतीय राष्ट्रीय कांग्रेस द्वारा जारी उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/tOyTHUM2TN
— Congress (@INCIndia) October 21, 2023