LOADING...
CM jagan : రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ
రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ

CM jagan : రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2024
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు రానున్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి పరామర్శించనున్నారు. కేసీఆర్ కాలుజారి కింద పడటంతో గత నెల 8న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఇక కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో గతనెల 15నెల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు.

 Details

ఎన్నికల్లో ఓడిన తర్వాత మొదటి సారి కేసీఆర్ ను కలవనున్న జగన్ 

ఇక తెలంగాణలో ఎన్నికల్లో కేసీఆర్ ఓడిన తర్వాత మొదటి సారి కేసీఆర్‌ను సీఎం జగన్‌ను కలవనున్నారు. దీంతో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడంది. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు. మరోవైపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ అభినందనలు తెలిపారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.