
హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు.
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె హకీంపేట విమానాశ్రయానికి చేరుకోగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కేంద్ర సాంస్కృతిక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి చేరుకున్నారు.
గచ్చిబౌలిలో సాయంత్రం జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను గతేడాది జూలై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న దశ్యం
Telangana Governor Tamilisai Soundararajan, CM K Chandrashekar Rao and Union Minister for Culture and Tourism G Kishan Reddy received President Droupadi Murmu on her arrival at Secunderabad. pic.twitter.com/XJRpYpnIev
— ANI (@ANI) July 4, 2023