LOADING...
దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ 
దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ 

వ్రాసిన వారు Stalin
May 04, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు. నూతన భవన ప్రారంభోత్సవానికి ముందు జరిగిన వాస్తు పూజ, వైదిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, బీఆర్‌ఎస్ జెండాను ఎగరవేశారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించడంలో ఈ కార్యలయ ప్రారంభోత్సం ఒక నాంది సూచికంగా కేసీఆర్ పేర్కొన్నారు. తొలుత ఆయన వేద మంత్రోచ్ఛారణల మధ్య భవనంలోని మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వేదపండితులు ఆశీర్వాదం ఇవ్వడంతో ఆయన తన సీటులో కూర్చుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post