Page Loader
దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం
దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం

దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం

వ్రాసిన వారు Stalin
May 03, 2023
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా మే 4వ తేదీన ఆయన వసంత్ విహార్‌లో శాశ్వత బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన బుధవారమే దిల్లీకి వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ దిల్లీ పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దిల్లీలో కేసీఆర్ ఎంత కాలం ఉంటారనేది ఎటువంటి సమాచారం లేదు. బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముందు కేసీఆర్ యాగం నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దిల్లీలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్

20నెలల్లో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం పూర్తి 

సీఎం కేసీఆర్ చివరిసారిగా డిసెంబర్ 12న సర్దార్ పటేల్ రోడ్‌లోని బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించేందుకు దిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామితో సమావేశం అయ్యారు. 2024లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీయేతర భాగస్వామ్యం గురించి చర్చించేందుకు కుమారస్వామితో పాటు అనేక రాష్ట్రాల రైతు సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2020లో వసంత్ విహార్‌లో 1,100చ.మీ. భూమిని పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం టీఆర్‌ఎస్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌)కి భూమిని అప్పగించారు. 2021సెప్టెంబర్‌లో సీఎం శంకుస్థాపన చేసి 20నెలల్లో నిర్మాణం పూర్తిచేశారు.