NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్
    తదుపరి వార్తా కథనం
    ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్
    ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తామని సీఎం కేసీఅర్ ప్రకటన

    ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్

    వ్రాసిన వారు Stalin
    Jan 12, 2023
    04:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులను ప్రకటించారు. జిల్లాలోని పలు తాండాలను పంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు.

    అలాగే మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌కు రూ.25 కోట్లు ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మంజూరైన ప్రతి రూపాయి నిధులను ప్రజల ప్రయోజనాలకే వినియోగించాలని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు.

    ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు దయనీయంగా ఉండేవని, ఇప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నట్లు చెప్పారు.

    కేసీఆర్

    రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను భారీగా పెంచకున్నాం: సీఎం కేసీఅర్

    రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్‌లు నిర్మించామని, వాటిల్లోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విభజనకు ముందు రాష్ట్రంలో నాలుగు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాలేజీల సంఖ్యను భారీగా పెంచుకున్నట్లు వివరించారు.

    గతంలో మహబూబాబాద్ చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు జిల్లాగా మారడంతో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. జిల్లాలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కాలేజీని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? తెలంగాణ
    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం
    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025