Page Loader
Revanth Reddy: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన 
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన

Revanth Reddy: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే సమయంలో ఈ భవనాలకు ప్రభుత్వ శంకుస్థాపన చేపట్టింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవనానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వివరాలు 

28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన

శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన జరిగింది. రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించడానికి చర్యలు కొనసాగుతున్నాయని సీఎస్ తెలిపారు.