
CM Revanth: డిసెంబర్ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్
ఈ వార్తాకథనం ఏంటి
క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడుగులు ముందుకేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సెక్రటేరియేట్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు నిర్వహించారు.
ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేసారు. డిసెంబర్ 28 నుంచి అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జనవరి 6వరకు ప్రజాపాలన సభలు నిర్వహించాలన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ప్రతిరోజు రెండు అధికార బృందాలు పర్యటన
ప్రజాపాలన సభలను ప్రతి రోజు ఉదయం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల చేపడుతారు.
రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రతిరోజు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాపాలన సభలకు సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించనున్నారు.
అలాగే ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ప్రజాపాలన సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటరైజ్ చేసి.. పరిశీలించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.