Page Loader
CM Revanth Reddy: హైదరాబాద్‌లో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
హైదరాబాద్‌లో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

CM Revanth Reddy: హైదరాబాద్‌లో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నివాసంలో జరిగిన ఈ భేటీలో, స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ పై ఇరువురు చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, AI వంటి రంగాల్లో సహకారం కోసం అవకాశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.

Details

ఇద్దరి మధ్య తొలి భేటీ

ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. సత్య నాదెళ్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సత్య నాదెళ్ల మధ్య ఇది తొలి భేటీ కావడం విశేషం.