తదుపరి వార్తా కథనం

Revanth Reddy: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 06, 2025
01:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధిగా పవిత్రమైన పట్టువస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం అంతా 'రామ' నామస్మరణతో మార్మోగింది.
మరోవైపు, తితిదే తరఫున ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.