Page Loader
Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి 
Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి 

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి.. తొలుత కేటీఆర్‌ను కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ స్వయంగా రేవంత్ రెడ్డిని కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న గదికి తీసుకెళ్లారు. ఎర్రవల్లిలోని తన నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్‌ జారిపడగా.. ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్‌కు తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్‌ అలీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత కేసీఆర్ వైద్యల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేసీఆర్‌ను పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి