LOADING...
Revanth Reddy: పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్‌రెడ్డి

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు గ్రామాల నుంచి పట్టణాల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవాలనే లక్ష్యంతోనే వారు ప్రజల్లోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో అప్పులు చేసి, పరిపాలనలో అనేక తప్పిదాలకు పాల్పడినవారు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు స్వేచ్ఛగా ఫోన్‌లో మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

కృతజ్ఞతా వందన సభలో ప్రసంగం..

2006లో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధిగా ఎన్నికై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన కృతజ్ఞతా వందన సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, తన పాత మిత్రులు, అనుచరులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. అనంతరం మిడ్జిల్ చేరుకుని సభా ప్రాంగణంలో రూ.47.08 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు డిజిటల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

వివరాలు

బతుకమ్మ చీరల్లో కూడా కమీషన్లు తీసుకున్నారని ఆరోపణ..

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం సుమారు రూ.లక్ష కోట్ల మేర సంపద కూడబెట్టగా, రాష్ట్ర ప్రజలకు మాత్రం రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ఆస్తులు, సంపద, పదవులు ఒకే కుటుంబానికి పరిమితమయ్యాయని, కానీ అప్పుల భారం మాత్రం తెలంగాణ ప్రజలపై పడిందని అన్నారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, కోటి ఎకరాలకు సాగునీరు వంటి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని వారు మళ్లీ ప్రజల వద్దకు రావడానికి నైతిక హక్కు ఏమిటని ఆయన ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీలో కూడా కమీషన్లు తీసుకున్నవారే తిరిగి అధికారాన్ని కోరుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement