LOADING...
Revanth Reddy: ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన 
ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన

Revanth Reddy: ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నెల 19 నుండి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి బయలుదేరనుంది. ఇక్కడ ఈ నెల 23 వరకు జరగనున్న 'ప్రపంచ ఆర్థిక వేదిక' వార్షిక సదస్సులో, వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో సమావేశాలు, చర్చల్లో సీఎం నేరుగా పాల్గొంటారు. బృందంలో పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌ రంజన్, సంజయ్‌కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. సదస్సు ముగిసిన తర్వాత బృందం హైదరాబాద్‌కు తిరిగి రానుండగా, తర్వాత ముఖ్యమంత్రి అమెరికాకు ప్రస్థానం చేస్తారని తెలుస్తోంది.

Advertisement