LOADING...
Tamil Nadu CM Oath Ceremony: సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి
సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి

Tamil Nadu CM Oath Ceremony: సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ మరికొద్ది సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా మారింది. ఇప్పటికే విజయ్ అక్కడికి చేరుకోగా, భారీ సంఖ్యలో అభిమానులు, టీవీకే కార్యకర్తలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో సినీ నటి త్రిష కృష్ణన్ కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె రాకతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.

వివరాలు

ప్రమాణస్వీకారానికి హజరుకానున్న రాహుల్ గాంధీ

ఇక విజయ్‌తో పాటు మొత్తం మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నారు. మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా చోటు కల్పించారు. మంత్రుల జాబితాలో ఎన్. ఆనంద్, ఆదవ అర్జున్, కె.ఎ. సెంగోటియన్, ఎస్. కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్ ఉన్నారు. కాగా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.

Advertisement