YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్
గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. క్రీడాపోటీలను ప్రారంభించిన అనంతరం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు వైఎస్ జగన్ క్రికెట్ మెలకువలను నేర్పించారు. రోజాకు జగన్ క్రికెట్ నేర్పిస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజరైన రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, అతిథులు ప్రత్యేకంగా వీక్షించారు. సీఎం జగన్ కూడా బ్యాట్‌ను తీసుకుని రెండు బంతులు క్రికట్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది. జగన్, రోజా క్రికెట్ ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'ఆడుదాం ఆంధ్రా' టోర్నమెంట్ డిసెంబర్ 26, 2023న ప్రారంభమై ఫిబ్రవరి 10, 2024 వరకు జరగనుంది.